పక్షవాతాన్ని జయించి.. ఆర్మీలో చేరాడు..!

ఇండియన్ ఆర్మీ అంటేనే మనకు ఎంతో ఇష్టం.. మనం సంతోషంగా ఉండటం కోసం వారు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి.. సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశాన్ని కాపాడుతుంటారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు.. వారి ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. అలాంటి టఫ్ లైఫ్ వారిది. వారు తీసుకునే ట్రైనింగ్ కూడా అంతే టఫ్ గా ఉంటుంది. మరీ అంత టఫ్ ట్రైనింగ్ తీసుకోవాలంటే శరీరం ఎంతో ఫిట్ గా ఉండాలి. 

ఇండియన్ ఆర్మీలో చేరాలనే కల చాలా మంది యువకులకు ఉంటుంది. తమ కలలను నిజం చేసుకునేందుకు ఎంతో కష్టపడతారు. తాజాగా జమ్ముకు చెందిన బాబా డానిష్ లాంగర్ అనే యువకుడు ఆర్మీలో చేరాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు పక్షవాతాన్ని సైతం జయించాడు.. 

డానిష్ కి చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలనే కల. కానీ 2017లో డానిష్ పక్షవాతానికి గురయ్యాడు. కనీసం సరిగ్గా నడవలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి ఆశలు నీరుగారిపోయాయి. కానీ, డానిష్ మాత్రం తన ఆశయాన్ని వదల్లేదు. తన కలను నెరవేర్చుకునేందుకు ఎంతో శ్రమించాడు. ఎన్నో సమస్యలను అధిగమించి.. పక్షవాతాన్ని జయించాడు.   

ఉత్తరాఖండ్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవల ఆర్మీ అధికారిగా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నాడు. దీంతో డానిష్‌ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తన సంకల్ప బలం, లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆశతో ఆరు నెలల్లోనే వ్యాధిని జయించాడని అతడి తండ్రి రాజేశ్‌ లాంగర్‌ చెబుతున్నారు.

Leave a Comment