చనిపోయే ముందు.. మెదడు ఏం ఆలోచిస్తుంది?.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!

మనిషి చనిపోయే ముందు వారి మెదడులో ఏం జరుగుతుంది? చనిపోతున్న మనిషి మెదడు ఏ విధంగా ఉంటుందో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చనిపోయే ముందు మనిషి జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలను మెదడు గుర్తుచేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చనిపోతున్న సమయంలో మనిషి మెదడులో పరిస్థితి ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. ధ్యానంలో ఉన్న సమయంలో, కలలు కనేటప్పుడు, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునేటప్పుడు ఎలా అయితే ఉంటుందో.. అలాగే చనిపోయేటప్పుడు కూడా మనిషి మెదడు పనిచేస్తోందని గుర్తించారు. ఈ విషయాలను ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్ ప్రచురించింది. 

మనిషి మెదడు ఆలోచనలను రికార్డు చేయడంతో శాస్త్రవేత్తలకు మెదడును మరింత అర్థం చేసుకునే దిశగా అడుగులు వేయగలిగామని డాక్టర్ జెమ్మార్ తెలిపారు. అయితే ఈ రికార్డింగ్ ప్రమాదవశాత్తు జరిగిందని అన్నారు. ఈమేరకు న్యూరో సైంటిస్టులు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 87 ఏళ్ల రోగి మెదడు తరంగాలపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. ఆ రోగి చనిపోతున్నప్పుడు అతని మెదడు ఊహించని విధంగా సంకేతాలను అందించిందన్నారు. అవి తన జీవిత జ్ఞాపకాలు(లైఫ్ రీకాల్) అయి ఉండవచ్చని చెప్పారు. గుండె ఆగిపోయిన తర్వాత ఆ రోగి మెదడు ఆలోచనలు 30 సెకన్ల పాటు కొనసాగినట్లు పేర్కొన్నారు. 

జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే క్రమంలో మెదడు చాలా కీలక పాత్ర పోషిస్తుందని, చనిపోవడానికి ముందుగా జీవితంలో కీలకమైన సంఘటనలను చివరిసారిగా గుర్తుకు తెచ్చుకుంటుదని జెమ్మార్ తెలిపారు. ఈ అధ్యయనంలో కచ్చితంగా జీవితం ఎప్పుడు ముగుస్తుంది.. అవయవ దానం చేసే సమయానికి ఏం జరుగుతుందనే ప్రశ్నలకు సంబంధించిన అవగాహనను సవాలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. 

 

 

Leave a Comment