కన్నతల్లితో ఛాలెంజ్.. ఆరేళ్లు ఫోన్ కి దూరం.. రూ.1.36 లక్షలు గెలిచాడు..!

ఈరోజుల్లో సెల్ ఫోన్ ఓ వ్యసనంగా మారింది. చిన్న పిల్లలు సైతం దానికి అడిక్ట్ అవుతున్నారు. సెల్ ఫోన్ వ్యసనాన్ని మాన్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కావడం లేదు. ఈక్రమంలో ఓ తల్లి చేసిన ప్రయత్నం వర్కవుట్ అయింది. సెల్ ఫోన్ వ్యసనాన్ని మాన్పించేందుకు ఓ తల్లి చేసిన ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు ఆమె ఏం చేసిందంటే.. 

అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన లోర్నా గోల్డ్ స్ట్రాండ్ కు సివెర్ట్ క్లెఫ్ సాస్ అనే కుమారుడు ఉన్నాడు. ఆరేళ్ల క్రితం.. సివెర్ట్ కి 12 ఉన్నప్పుడు అతడు సెల్ ఫోన్ కి బానిస అయ్యాడు. ఎప్పుడు చూసిన సెల్ పోన్ పట్టుకుని కూర్చునే వాడు. ఈ వ్యసనాన్ని ఎలాగైనా దూరం చేయాలని సివెర్ట్ తల్లి భావించింది. 

ఈక్రమంలో తల్లికి ఓ వినూత్న ఐడియా వచ్చింది. ఓ రోజు రేడియోలో 18 ఫర్ 18 ఛాలెంజ్ అనే కాన్షెప్ట్ గురించి తెలుసుకుంది. అదే స్ఫూర్తిగా తన కొడుక్కి ఓ ఛాలెంజ్ విసిరింది. ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే సివెర్ట్ 18వ పుట్టిన రోజున 1800 డాలర్లు అంటే రూ.1.36 లక్షలు ఇస్తానని చెప్పింది. 

ఆ ఛాలెంజ్ కి కొడుకు సివెర్ట్ టెంప్ట్ అయ్యాడు. ఎందుకంటే చిన్న వయసులో 1800 డాలర్లు అంటే పెద్ద అమౌంటే.. వెంటనే తల్లి చేసిన ఛాలెంజ్ ని స్వీకరించాడు. అంతే ఆరేళ్ల పాటు సోషల్ మీడియా జోలికి వెళ్లలేదు. ఇటీవల సివెర్ట్ 18వ పుట్టిన రోజు సందర్భంగా.. ఛాలెంజ్ ప్రకారం 1800 డాలర్లు ఇచ్చింది తల్లి.. కొడుకు ఫొటోను తన ఫేస్ బుక్ లో పంచుకుంది. జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది.     

 

Leave a Comment