కోవిడ్ నుంచి కోలుకున్నాక.. 2 ఏళ్ల బాబుకు గుండెపోటు..!

చిన్న పిల్లలకు కరోనా వచ్చినా ఏం కాదులే అని చాలా మంది నమ్మకంగా ఉంటారు. కానీ కొందరికి అది ప్రాణంతకమవుతుంది. ఢిల్లీలో గతేడాది ఆగస్టులో రెండేళ్ల బాబుకు కరోనా వచ్చింది. ఆ తర్వత కోలుకున్నాడు. గతేడాది డిసెంబర్ లో ఆ బాబుకు దగ్గు మొదలైంది. కొన్ని రోజులకు ఇది తీవ్రమైన జ్వరం, శ్వాస సమస్యలతో తీవ్రమైంది. పరిస్థితి విషమించడంతో ఆ బాలుడిని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

ఆస్పత్రికి తీసుకొచ్చిన కొద్ది సేపటికే ఆ చిన్నారికి కార్డియాక్ అరెస్ట్ సంభవించింది. వైద్యులు వెంటనే సీపీఆర్ మొదలుపెట్టారు. దాదాపు అరగంట సేపు సీపీఆర్ చేసిన తర్వాత మళ్లీ గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది. ఆ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. ఆ చిన్నారికి బ్రోన్కియోలిటిస్ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. బ్రోన్కియోలిటిస్ అంటే తీవ్రస్థాయిలో నిమోనియా ఉండటం.. దీని వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని, గుండె చుట్టూ ఉన్న సాక్ ప్రభావితమైంది. దాని వల్లే కార్డియాక్ అరెస్ట్ సంభవించింది. 

ఆ బాలుడికి చికిత్స అందించిన డాక్టర్ సయీద్ ముస్తఫా హసన్ మాట్లాడుతూ ఈ బాలుడు మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్స్ అనే సమస్యతో బాధపడుతున్నాడని, ఈ వ్యాధి ప్రధాన అవయవాలను దెబ్బతీసి ప్రాణం తీస్తుందని చెప్పారు. కరోనా రాక ముందు బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. వచ్చిన తర్వాత తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. కనీసం మూత్రానికి కూడా వెళ్లలేకపోయేవాడు. మాట్లాడటం కష్టమైంది. ఎదుటివారిని చూసి మాట్లాడే ఐ కాంటాక్ట్ ను కూడా కోల్పోయాడు. ఇవన్నీ పోస్ట్ కోవిడ్ లక్షణాలే అని వైద్యులు చెప్పారు. చికిత్స తర్వాత నెల రోజులకు ఆ బాబు కోలుకున్నాడు. పిల్లల్లో కార్డియాక్ అరెస్ట్ రావడం చాలా అరుదని, రెండేళ్ల బాబు ఈ పరిస్థితిని రావడానికి కారణం కరోనా వైరస్ అని వైద్యులు వివరించారు. 

Leave a Comment