ఇకపై రేషన్ బియ్యానికి బదులు డబ్బులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డుదారులు తమకు బియ్యం వద్దనుకుంటే దానికి బదులు నగదు ఇచ్చేందుకు సమాయత్తమైంది. డబ్బులు వద్దనుకుంటే సరకులు తీసుకోవచ్చు. వచ్చే నెల నుంచి కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభించనున్నారు.. నగదు బదిలీకి అంగీకరరించిన వారికి బియ్యానికి బదులు డబ్బులు ఇస్తారు..

ఈ విధానాన్ని అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో కార్డుదారులు బియ్యానికి బదులు నగదు కోరితే అందిస్తారు. దశల వారీగా అన్ని జిల్లాలకు దీనిని విస్తరించాలని ప్రభుత్వవం భావిస్తోంది..ఈనెల 18 నుంచి 22 వరకు వాలంటీర్లతో సమ్మతి పత్రాలు సేకరించి ముందస్తు సమాచారం ఇచ్చిన వారికి నగదు చెల్లించాలని నిర్ణయించారు. 

వీఆర్వో, తహసీల్దార్ల పరిశీలన తర్వాత రేషన్ దుకాణల నుంచి ఇండెంట్లు స్వీకరించిన పౌరసరఫరాల శాఖ బియ్యం సరఫరా చేయనుంది. అయితే కార్డుదారులకు కిలో బియ్యానికి ఎంత ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదు. రూ.12 నుంచి రూ.15 మధ్య ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు నెలలు నగదు తీసుకున్నా.. ఆ తర్వాత బియ్యం కావాలంటే తీసుకోవచ్చు. నగదు బదిలీ విధానం ద్వారా రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బియ్యం అందించే కార్డుదారులకు మాత్రమే నగదు బదిలీ వర్తించే అవకాశం ఉంది. 

 

 

 

Leave a Comment