చాణక్య నీతి ప్రకారం.. ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు..!

చాణుక్యుడు గొప్ప గురువు మాత్రమే కాదు.. నైపుణ్యం కలిగిన వ్యూహకర్త, ఆర్థికవేత్త.. చాణుక్యుడు రాసిన చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన ప్రతి అంశం ఉంటుంది. మతం, రాజకీయాలు, సమాజం, మానవ జీవితంలోని ప్రతి దశ గురించి చర్చించారు. మానవ జీవితంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదని తన కళ్లతో ఎత్తి చూపాడు. 

జీవితం ఆనందంగా గడపడానికి డబ్బు చాలా అవసరమని ఆయన చాణక్య నీతిలో చెప్పారు. కానీ చాలా డబ్బు సంపాదించినప్పుటికీ ఏ విధంగానూ ఆదా చేయలేని వారు చాలా మంది ఉన్నారు. వారు మళ్లీ ప్రయత్నించినప్పటికీ డబ్బులు సంపాదించలేరు. అంటే లక్ష్మీదేవి వారి ఇంట్లో ఉండదు. చాణక్య నీతి ప్రకారం ఎలాంటి వ్యక్తులు డబ్బు ముఖాన్ని ఎప్పటికీ చూడలేరో ఇప్పుడు తెలుసుకుందాం.. 

చాణక్య సూత్రం ప్రకారం:

  • రాత్రి నిద్రకు మంచి సమయం.. చాణుక్యుడి ప్రకారం సూర్యోదయం, సూర్యాస్తమయంలలో నిద్రించే వ్యక్తికి అర్థం ఉండదు. పగటిపూట నిద్రపోయే వ్యక్తికి జీవితాంతం డబ్బు ఉండదు. అంటే భాగ్యలక్ష్మీ అలాంటి వ్యక్తలకు సహాయం చేయదు. 
  • ఎప్పుడూ గంభీరంతో, కఠినంగా, చెడ్డమాటలు మాట్లాడే వ్యక్తులు డబ్బును ఎప్పుడూ ఆదా చేయలేరు. అతనికి జీవితాంతం డబ్బు ఉండదు. ప్రతి మానవుడు మధురమైన భాషలో మాట్లాడాలి. అప్పుడే భాగ్యలక్ష్మి అతడితో సంతోషంగా ఉంటుంది. 
  • ఆకలి ఉన్న వానికంటే ఎక్కువగా తినే వ్యక్తి చేతిలో డబ్బు ఆదా కాదు. అతిగా తినడం కోసం ఎక్కువ ఖర్చు చేసే వ్యక్తులు ఆర్థికంగా ఎక్కువ నష్టపోతారు. లక్ష్మీదేవి ఇలాంటి వారిని అస్సలు ఇష్టపడదు. కాబట్టి ఆకలి ప్రకారం తినడం మంచిది. 
  • దంతాలు శుభ్రంగా లేని వారు కూడా డబ్బును ఆదా చేయలేరు. మురికి పళ్లతో ఉన్న లక్ష్మీదేవికి ఇష్టముండదని చాణక్య పేర్కొన్నారు. కాబట్టి శుభ్రతను పాటించాలి. 
  • చట్టవిరుద్ధంగా డబ్బు సంపాదించే వ్యక్తులు ఎప్పుడు ధనవంతులు కాలేరు. ఈ డబ్బు చేతిలో నుంచి ఏదో ఒక రూపంలో బయటికి వెళ్లిపోతుంది.
  • అతిథులను అగౌరవపరిచే వ్యక్తులు.. ఆర్థిక, సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటారు. డబ్బు, గౌరవ మర్యాదలు లేకుండా జీవిత కాలం జీవిస్తారు.  

Leave a Comment