తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగింపు..!

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు పొగించింది. ఈనెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. రేపటి నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. 

అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదన చేసింది. ఆరోగ్య శాఖ సిఫార్స్ మేరకు విద్యాసంస్థలకు సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈనేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.  

Leave a Comment