74 ఏళ్ల ఈ ఆటో డ్రైవర్.. ఒకప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్..!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో పోస్టులు వైరల్ అవుతుంటాయి.. వాటిలో కొన్ని పోస్టులు మాత్రం స్ఫూర్తిని ఇచ్చేవి ఉంటాయి. మనకు జీవిత పాఠాలను  నేర్పుతాయి.. అలాంటిదే బెంగళూరుకు చెందిన ఈ ఆటో డ్రైవర్ స్టోరీ కూడా.. 74 ఏళ్ల ఆటో డ్రైవర్.. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతూ అందరనీ ఆశ్యర్య పరుస్తున్నాడు.. ఒకప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్ గా చేసి.. ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు.. మరీ ఆయన స్టోరీ ఎంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. 

బెంగళూరులో నికితా అయ్యర్ అనే ఉద్యోగిని.. ఆ ఆటో డ్రైవర్ తో పరిచయాన్ని లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసింది. అంతే ఆ పోస్ట్ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇంతకు ఏం జరిగిందంటే.. నికితా అయ్యర్ ఆఫీస్ కి వెళ్లేందుకు రోడ్డుపై నిలబడింది. ఇంతలో ఓ పెద్దాయన ఆటో ఆపి ‘ఎక్కడికి వెళ్లాలి’ అని ఇంగ్లీష్ లో అడిగాడు. ‘ఆఫీస్ కి వెళ్లాలి’ అని ఆమె కొంచెం కంగారుపుడుతూ ఇంగ్లీష్ లోనే చెప్పింది. ‘ఓకే మేడమ్.. మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి’ అంటూ ఆ పెద్దాయన చెప్పారు.

ఆ పెద్దాయన మాట్లాడుతున్న ఇంగ్లీష్ విని నికిత షాక్ అయ్యింది. ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఆమెలో మొదలైంది. మీరు ఇంత బాగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు’ అంటూ ఆ పెద్దాయనను అడిగేసింది. ‘నేను గతంలో ఇంగ్లీష్ లెక్చరర్’ అని అన్నాడు. ‘ఇప్పుడు ఆటో ఎందుకు నడుపుతున్నారని అడగాలనుకుంటున్నారు కదూ’ అంటూ ఆ పెద్దాయనే అన్నారు. ‘అవును.. చెప్పండి ప్లీజ్’ అంటూ నికిత చెప్పింది. అంతే 45 నిమిషాల ప్రయాణంలో సజీవ జీవితపాఠాన్ని తెలుసుకుంది..  

‘నా పేరు పట్టాభి రామన్. ఎం.ఏ, ఎం.ఇడి చేశాను. బెంగళూరులో జాబ్ రాలేదు. ఎక్కడికి వెళ్లినా కులం గురించి అడిగేవారు. అది నచ్చక ముంబైకి వెళ్లాను. అక్కడ ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా 20 సంవత్సరాలు పనిచేశాను. 60 ఏళ్ల వయస్సులో మళ్లీ బెంగళూరు వచ్చాను. ఇప్పుడు నాకు 74 ఏళ్లు’.  

‘ప్రైవేట్ లెక్చరర్ లకు పింఛన్ ఉండదు. మళ్లీ లెక్చరర్ గా పనిచేయాలనుకున్నా రూ.10-15 వేలకు మించి రాదు. అందుకే ఆటో నడుపుతున్నాను. ఇది నాకు, నా గర్ల్ ఫ్రెండ్ కి సరిపోతుంది’. ఇంతలో గర్ల్ ఫ్రెండా? అని ఆశ్చర్యంగా అడిగింది నికితా.. దీనికి పట్టాభి రామన్ సమాధానం చెబుతూ.. ‘అవును.. నా భార్యను నేను గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తాను.  ఆమెకు 72 ఏళ్లు.. నాకు ఒక కొడుకు ఉన్నాడు. నేను నా గర్ల్ ఫ్రెండ్ కారుగోడిలో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటాం.. దానికి 12 వేల రూపాయలు అద్దె.. అది నా కొడుకు కొడతాడు. అంతకు మించి మా పిల్లల నుంచి ఏమీ ఆశించం.. మేమిద్దరం ఉన్నదాంతో హ్యాపీగా ఉంటాం.. మాకు పిల్లలపై ఆధారపడం ఇష్టం లేదు. ఎవరి జీవితం వారిది’.. అంటూ ఆ పెద్దాయన తన స్టోరిని చెప్పాడు.. 

పట్టాభి రామన్ మాటలు విన్న నికితా అయ్యర్ ఆ స్ఫూర్తిదాయక స్టోరీని లింక్డ్ ఇన్ అకౌంట్ లో షేర్ చేసింది. ‘జీవితంలో ఎటువంటి ఫిర్యాదు లేవు. చింతించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారు నిజమైన హీరోలు. కాకపోతే వీళ్ల గురించి మనకు తెలియదు. నిజంగా పట్టాభి రామన్ పరిచయం నాకు స్ఫూర్తినిచ్చింది’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వెంటనే క్షణాల్లో 70 వేల మంది లైక్ చేశారు. వేల మంది దాన్ని షేర్ చేశారు. 

   

Leave a Comment