మరో పెళ్లికి సిద్ధమైన సివిల్స్ టాపర్..!

టీనా దాబి.. ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది.. ఈమె చాలా సార్లు వార్తల్లో నిలిచింది. టీనా 2015లో ఐఏఎస్ టాపర్.. అదే ఏడాది సెకండ్ టాపర్ గా నిలిచిన అధర్ అమిర్ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2018లో వీరు వివాహం చేసుకున్నారు. అప్పుడు ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే సరిగ్గా రెండేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది విడాకులు తీసుకుంది ఈ ఐఏఎస్ జంట.. 

ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు టీనా దాబి.. 2013 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాండేను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఇటీవల ఆయనతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీనా దాబి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం రాజస్థాన్ క్యాడర్ లో విధులు నిర్వహిస్తున్నారు. 

మహారాష్ట్ర కు చెందిన ప్రదీప్ టీనా కంటే రెండేళ్లు సీనియర్ బ్యాచ్. ప్రస్తుతం రాజస్థాన్ లో పురాతత్వ, మ్యూజియం శాఖకు డైరెక్టర్ గా ఉన్నారు. టీనా దాబి ప్రస్తుతం రాజస్థాన్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు.  ఏప్రిల్ 22న రాజస్థాన్ లోని జైపూర్ లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. టీనా దాబి చెల్లెలు రియా కూడా 2020 సివిల్స్ పరీక్షల్లో 15వ ర్యాంక్ సాధించింది. 

 

Leave a Comment