ఏపీలో కరెంట్ ఛార్జీల మోత.. కొత్త ఛార్జీలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ప్రజలకు షాక్ ఇచ్చింది.   విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అన్ని స్లాబుల్లోనూ ఛార్జీలను పెంచేసింది. పెంచిన విద్యుత్ ఛార్జీల టారీఫ్ వివరాలను తిరుపతిలో ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి బుధవారం విడుదల చేశారు.. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్ లను తీసుకొస్తామని తెలిపారు. విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టే తప్పని పరిస్థితుల్లో చార్జీలు పెంచాల్సి వచ్చిందని నాగార్జున రెడ్డి వివరించారు.

పెరిగిన కరెంట్ ఛార్జీల ధరలు ఇవే:

  • 30 యూనిట్ల వరకు యూనిట్ కు 45 పైసలు పెంపు
  • 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు 91 పైసలు పెంపు
  • 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.40 పెంపు
  • 126-225 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.157 పెంపు
  • 226-400 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.16 పెంపు
  • 400 యూనిట్లు దాటితే యూనిట్ కు 55 పైసలు పెంపు

విద్యుత్ ఛార్జీల పెంపు తర్వాత రేట్లు:

  • 30 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.45 ఉంటే ఇప్పుడు రూ.1.90
  • 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.2.09 ఉంటే రూ.3
  • 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.3.10 ఉంటే రూ.4.5
  • 126-225 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.4.43 ఉంటే రూ.6
  • 226-400 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.7.50 ఉంటే రూ.8.75
  • 400 యూనిట్లు దాటితే యూనిట్ కు రూ.9.20 ఉంటే రూ.9.75

 

 

Leave a Comment