40 ఏళ్లుగా నిరుపేదల ఆకలి తీరుస్తున్న 72 ఏళ్ల వృద్ధుడు..!

ప్రపంచంలో మనిషి చేసే మంచి పనులే వారికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడతాయి. డబ్బు ఉంటేనే పెద్ద వారు కాదు.. నలుగురి ఆకలి తీరిస్తేనే మంచివారుగా మిగులుతారు.. గుజరాత్ లోని ఓ వ్యక్తి 40 ఏళ్లుగా నిరుపేదల ఆకలి తీరుస్తున్నాడు. మోర్బీ నగరానికి చెందిన బచుదాదా ఒక ధాబా నడుపుతున్నాడు. ఈ ధాబా పేరు ‘బచుదాదాస్ ధాబా’.. బచుదాదా 40 సంవత్సరాలుగా ప్రజలకు ఆహారం అందిస్తున్నాడు.

అతని ధాబాలో ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. ‘కావాల్సినంత తినండి.. ఉంటేనే డబ్బులు ఇవ్వండి’ అనే నినాదంలో ఈ ధాబాను ఆయన నడుపుతున్నారు. 72 ఏళ్ల బచుదాదా గత 40 సంవత్సరాలుగా గుడిసెలో ఉంటూ ధాబా నడుపుతున్నాడు. అతని ధాబాలో ఫుల్ ప్లేట్ పుడ్ ధర రూ.40. కానీ అక్కడ తిన్న వారిని ఆయన డబ్బులు అస్సలు అడగరు.. వారు ఎంత ఇచ్చినా.. రూ.10 లేదా రూ.20 ఇచ్చినా తీసుకుంటారు. వారి వద్ద డబ్బులు లేకపోతే అస్సలు అడగరు.. అసలు వారు వైపు ఆయన చూడరు. ఎందుకంటే వారు నామోషీగా ఫీలు కాకూడదని…

ఈ ధాబాలో బచుదాదా భార్య కూడా పనిచేసేవారు.. కానీ గతేడాది ఆయన భార్య మరణించారు. అప్పటి నుంచి బచుదాదా ఒంటిరిగా ధాబా నడుపుతున్నారు. బచుదాదా ధాబాలో ప్లేట్ లో మూడు రుచికరమైన కూరగాయలు, రోటీ-దాల్-రైస్, పాపడ్ మరియు మజ్జిగ ఉంటాయి. అయితే చాలా మంది ఆదాయం కోసం పనిచేస్తుంటారు. కానీ తనకు ఆదాయం ముఖ్యం కాదని, పేదల ఆకలి తీర్చడమే తనకు ముఖ్యమని బచుదాదా అంటున్నారు..

Leave a Comment