ఇలా చేస్తే మీకు గుండె సమస్యలు అస్సలు రావు..ఆరోగ్యంగా ఉంటారిలా

హార్ట్ ప్రాబ్లంస్ ఈ మధ్య కాలం లో ఎక్కువైపోతున్నాయి. ఇందు వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కానీ, నిజానికి అలా ఉండాల్సిన అవసరం లేదు. జీవన శైలి లో కొద్దిగా చేసుకునే మార్పుల వల్ల గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోగలం. ఆ మార్పులేమిటో ఒకసారి తెలుసుకుందాం.
ఎక్సర్‌సైజ్ చేసే హార్ట్ హెల్దీ గా ఉంటుంది. హార్ట్ హెల్త్ కి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. వారానికి 150 నిమిషాల మోడరేట్ ఎక్సర్సైజ్ కానీ, 75 నిమిషాల విగరస్ ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే హార్ట్ హెల్త్‌కి ఢోకా లేదు. నడక, పరుగు, ఆట, ఈత, డాన్స్, సైకిల్… మీ ఇష్టం. ఇదేదో పనిష్మెంట్ లా చేయకండి. మీకు నచ్చే యాక్టివిటీ ఎంచుకుంటే మీరూ సరదాగా క్రమం తప్పకుండా చేసేస్తారు.
ఫ్యాట్స్ లో హెల్దీ ఫ్యాట్స్, అన్ హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. కూరలు, నట్స్, గింజలు, ఫిష్, పండ్ల నుండి వచ్చే ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్స్. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి, గుడ్ కొలెస్ట్రాల్ పెంచి హార్ట్ డిసీజ్ యొక్క రిస్క్ ని రెడ్యూస్ చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ హార్ట్ మజిల్స్ ఒక స్టడీ రిథం ఫాలో అయ్యేలా చేస్తాయి. సలాడ్ డ్రెస్సింగ్స్, స్ప్రెడ్స్, సాసెస్, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకుంటే అన్ హెల్దీ ఫ్యాట్స్ ని కంట్రోల్ చేసిన వారవుతారు.
పళ్ళ వద్ద పెరిగే బ్యాక్టీరియా డైరెక్ట్ గా హార్ట్ ని ఎఫెక్ట్ చేయగలదని స్టడీస్ చెబుతున్నాయి. అందుకే రౌజూ రెండు సార్లు బ్రష్ చేసుకోండి, ఫ్లాస్ చేసుకోవడం మర్చిపోకండి. స్మోకింగ్ వల్ల కాన్సరే కాదు, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ కూడా ఉంది. స్మోకింగ్ వల్ల ఆర్టరీస్ లో ఫ్యాటీ సబ్స్టెన్సెస్ పేరుకుపోతాయి. సెకండ్ హాడ్ స్మోక్ కూడా కార్డియో వాస్క్యులర్ డిసీజ్ తో లింక్ చేయబడింది.
బరువు ఎక్కువ ఉండడం వల్ల ఆర్టరీల యొక్క గోడల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఇందు వల్ల గుండె ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయవలసి వస్తుంది. ఇందు వల్ల హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. డైట్ కీ హార్ట్ కీ డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతాం, బరువు పెరిగితే హార్ట్ కి ప్రాబ్లంస్ వస్తాయి. కాబట్టి పోర్షన్ కంట్రోల్ ద్వారా ఎంత కావాలో అంతే తీసుకుంటే గుండెకి మంచిది.
నిద్ర కీ గుండె కీ ఏం సంబంధం అనుకుంటున్నారా? వయసుతో సంబంధం లేకుండా నిద్రలేమి కీ కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ కీ రిలేషన్ ఉంది. నిద్ర లో బాడీ తనని తను రిపెయిర్ చేసుకుంటుంది. నిద్ర సరిపోకపోతే ఆ పని సరిగ్గా జరగదు. మీరు తీసుకునే ఆహారం కొలెస్ట్రాల్ ఫ్రెండ్లీ గా ఉండాలి. సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ లిమిట్ చేసి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే హార్ట్ హెల్త్ బాగుంటుంది. సంగీతానికి ఒత్తిడిని తగ్గించే శక్తి ఉందని మీరు వినే ఉంటారు. అంతే కాదు, మృదువైన సంగీతానికి బీపీ తగ్గించే శక్తి కూడా ఉంది. రోజుకి కనీసం ముప్ఫై నిమిషాల పాటూ మ్యూజిక్ వింటే ఒత్తిడి తగ్గి, హార్ట్ రేట్ స్లో అయ్యి, యాంగ్జైటీ తగ్గుతుంది.

Leave a Comment