129 మంది పిల్లలకు తండ్రి.. తగ్గేదేలే అంటున్న 66 ఏళ్ల వృద్ధుడు..!

ఈరోజుల్లో చాలా మంది ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటున్నారు. మరికొందరికి అసలు సంతానమే కలగడం లేదు. అందుకు కారణం.. మహిళల్లో కొందరికి  లోపం ఉంటే.. పురుషుడి లోపం వల్ల గర్భం దాల్చలేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఏం చేయాలో.. ఎవరికి చెప్పాలో తెలియక మనోవేదనకు గురవుతున్నారు. అలాంటి వారికి ఓ 66 ఏళ్ల వ్యక్తి వీర్య దానం చేస్తున్నాడు. ఇప్పటికీ 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. 

పాశ్చాత్య దేశాల్లో వీర్యదానం కొత్తేమి కాదు. దీనికి అక్కడి చట్టాలు కూడా అనుమతిస్తాయి. యూకేకి చెందిన క్లయివ్ జోన్స్ అనే 66 ఏళ్ల వ్యక్తి రిటైర్డ్ టీచర్.. ఆయన 58 ఏళ్ల వయసు నుంచి వీర్య దానం చేస్తున్నట్లు చెప్పాడు. వీర్యం ఇచ్చేందుకు డబ్బులు కూడా తీసుకోవడం లేదని వెల్లడించాడు. ఈయన ఫేస్ బుక్ ద్వారా కస్టమర్లకు కనెక్ట్ అయి ఉచితంగా వీర్య దానం చేస్తున్నాడు. 

ఇప్పటి వరకు జోన్స్ ఇచ్చిన వీర్యంతో 129 మంది పిల్లలు పుట్టారు. మరో 9 మంది పుట్టబోతున్నారు. తన వల్ల పుట్టిన 129 మంది పిల్లల్లో 20 మందిని తాను నేరుగా కలిసినట్లు క్లైవ్ చెప్పారు. 150 మందికి తండ్రి అయిన తర్వాత వీర్యదానం చేయనని పేర్కొన్నాడు. యూకేలో అధిక సంఖ్యలో క్లినిక్ లు, స్పెర్మ్ బ్యాంకులు వీర్యాన్ని అమ్ముతున్నాయని, అది తనకు నచ్చలేదని క్లైవ్ అంటున్నారు.

ఫేస్ బుక్ లో అన అకౌంట్ కి చాలా సందేశాలు, రిక్వెస్టులు వస్తాయని, వాటి నుంచి తాను ఎవరికీ సాయం చేయాలో ఎంపిక చేసుకుంటానని క్లైవ్ తెలిపారు. అయితే క్లైవ్ అధికారికంగా స్పెర్మ్ డోనర్ కాదు. బ్రిటన్ లో స్పెర్మ్ డోనర్ గరిష్ట వయసు 45 ఏళ్లు ఉండాలి. వయసు రీత్యా తాను వీర్యదానం చేసేందుకు యూకే ప్రభుత్వం అంగీకరించదని, అందుకే ఫేస్ బుక్ ద్వారా వీర్య దానం చేస్తున్నట్లు క్లైవ్ వెల్లడించారు. 

    

    

Leave a Comment