కూతురికి బ్రెయిన్ సర్జరీ.. తండ్రి చేసిన పనికి నెటిజన్లు ఫిదా..‘డాడ్ ఆఫ్ ది ఇయర్’ అంటూ..!

తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఉన్న ప్రేమ కంటే గొప్ప ప్రేమ మరొకటి ఉండదు. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మధ్య స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధం వర్ణించలేనిది.. కూతురు వేసే ప్రతి అడుగూ తండ్రికి ఆనందాన్ని ఇస్తుంది. ఇది చాలా సందర్భాల్లోనూ నిరూపితమైంది. ప్రస్తతం ఓ తండ్రి, కూతురి మధ్య అపూరూపమైన బంధాన్ని వర్ణించే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతూరుకు బ్రెయిన్ సర్జరీ తర్వాత ఓ తండ్రి చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు.

ఓ చిన్న పాపకు బ్రెయిన్ సర్జరీ అయ్యింది. తల మధ్య భాగంలో చిన్నారికి చాలా కుట్లు పడ్డాయి. అయితే ఆ చిన్నారి తండ్రి మాత్రం కూతురిపై అపురూపమైన ప్రేమను చూపించాడు. తన కూతురికి షేవ్ చేసినట్లుగానే ఆ తండ్రి కూడా తన జుట్టుకు షేవ్ చేయించుకున్నాడు. అంతేకాదు పాపకు వేసిన కుట్ల మాదిరిగానే కటింగ్ చేసుకున్నాడు. 

ఆ తండ్రి తన తలను ప్రేమగా కూతురి తలను హత్తుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. ‘నిస్వార్థప్రేమ’, ‘తండ్రి ప్రేమను ఇంతకంటే ఎలా చూపిస్తారు’,‘డాడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాల్సిందే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Leave a Comment