మరో డేంజరస్ వైరస్ ‘నియోకోవ్’.. సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి..!

కరోనా మహమ్మారి ఇప్పటికే రూపాలు మార్చుకుంటూ ప్రపంచ దేశాలను విణికిస్తోంది.. ఈ సమయంలో చైనాలోని వూహాన్ శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి వార్తను చెప్పారు. దక్షిణాఫ్రికాలో మరో కొత్త రకం వైరస్ ‘నియోకోవ్’ బయటపడిందని, ఇది గత వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని, మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని రష్యాకి చెందిన న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ వెల్లడించింది. 

నియోకోవ్ వైరస్ ని దక్షిణాఫ్రికాలో తొలుత గబ్బిలాల్లోనే గుర్తించారు. ఇది కూడా కరోనా వైరస్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకే వ్యాప్తి చెందుతున్న వైరస్ గా గుర్తించారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వూహాన్ శాస్త్రవేత్తలు తెలిపారు. 

కరోనా వైరస్ పాథోజెన్ కు భిన్నంగా ఏసీఈ2 రిసెప్టర్ తో కలవడం ద్వారా కొత్త వైరస్ ప్రమాదాన్ని కలిగిస్తుందని పరిశోధనలో తేలింది. నియోకోవ్ అడ్డుకునేందుకు యాంటీబాడీలు, వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నియోకోవ్ అనేది మెర్స్ హైకోవ్  హైపోటెన్షియల్ కాంబినేషన్ ను కలిగి ఉంటుంది. దీంతో మరణాల రేటు అధికంగా ఉండవచ్చిన హెచ్చరిస్తున్నారు. అంటే ఈ వైరస్ మనుషులకు సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించవచ్చిని అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిశోధనపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని, మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వెక్టార్ వైరస్ స్టేట్ రీసర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

Leave a Comment