104 ఏళ్ల వయసులో 4వ తరగతి.. నూటికి 89 మార్కులు..!

చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది కేరళకు చెందిన కుట్టియమ్మ..104 ఏళ్ల వయసులో రాయడం, చదవడం నేర్చుకుంది. అంతేకాదండోయ్ పరీక్ష రాసిన నూటికి 89 మార్కులు తెచ్చుకుంది.. మరీ ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. 

కేరళలోని కొట్టాయాంకు చెందిన కుట్టియమ్మకు 104 ఏళ్లు. కుట్టియమ్మ తన జీవితంలో ఒక్కసారి కూడా స్కూల్ కు వెళ్లలేదు. అయితే ఆమె చదువుకోవాలన్న ఆశతో ఒక ఎన్జీవో నిర్వహిస్తున్న క్లాసులకు వెళ్లడం మొదలుపెట్టింది. ‘సాక్షరత ప్రేరక్ రెహ్నా’ ద్వారా ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించే క్లాసులకు వెళ్లింది. అక్కడ చదవడం, రాయడం నేర్చుకుంది.

అలా కుట్టియమ్మ 4వ తరగతి పరీక్షలు రాయడానికి అర్హత సాధించింది. 104 ఏళ్లు కాబట్టి తనకు వినికిడి సమస్య ఉంది. అందుకే పరీక్ష హాలులో ఇన్విజిలేటర్లు తన కోసం ప్రత్యేకంగా గట్టిగా మాట్లాడాలని కోరిందట.. పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాదండోయ్ పరీక్షలో 100కి 89 మార్కులు సాధించింది.. 

చిన్నప్పటి నుంచి స్కూల్ కి వెళ్లని కుట్టియమ్మ ఒక్కసారిగా నాలుగో తరగతి పరీక్ష రాసి తన మార్కులను చూసి సంతోషపడుతోంది.. అలా కుట్టియమ్మ నవ్వుతున్న ఫొటోను కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాసుదేవన్ శివన్ కుట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుట్టియమ్మ అంకితభావానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఆ ముసలావిడ నవ్వు గురించి మీరేమంటారు ఫ్రెండ్స్..  

Leave a Comment