భార్యను మరువలేక.. చనిపోయిన భార్య విగ్రహం ఏర్పాటు..!

ఈ లోకంలో భార్యాభర్తల బంధం విడిపోనిది.. పెళ్లితో ఒక్కటై.. చనిపోయేంత వరకు కలిసే ఉంటారు..అలాంటి బంధాన్ని కూడా ఏదో రోజు కాలం విడదీస్తుంది. ఇద్దరిలో ఒకరు ఎప్పటికైనా ఒంటరి కావాల్సిందే.. అన్ని సంవత్సరాలు కలిసి ఉండి.. ఎవరైనా ఒకరు దూరమైతే.. వారి పరిస్థితి చెప్పలేనిది.. అలా భార్య దూరమైన భర్త.. తన జ్ఞాపకాలను వీడలేకపోయాడు. అందుకే ఆమె మీద ప్రేమతో విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.. 

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన గంటలబోయిన హన్మంతుకు 83 ఏళ్లు.. ఆయన భార్య  రంగమ్మ సెప్టెంబర్ 9, 2019లో చనిపోయింది. ఇన్నాళ్లు తన కష్టసుఖాలలో పాలుపంచుకుని తనకు అండగా ఉన్న భార్యను హన్మంతు మరిచిపోలేకపోయాడు. ఆమె గుర్తుగా రూ.7 లక్షలతో తన పొలంలో భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. 

గతంలో తన సొంత పొలంలో దాతల సహాయంతో ఆంజనేయస్వామి దేవాలయాన్ని నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు. ఈ ఆలయం పక్కనే తన సొంత పొంలో భార్యకు మండపాన్ని ఏర్పాటు చేశారు. హన్మంతుకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ విగ్రహాన్ని చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వస్తున్నారు. 

Leave a Comment