జొమాటో గొడవ : యువతిపైనే కేసు వేసిన జొమాటో డెలివరీ బాయ్..!

ఇటీవల జొమాటో డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్ ను క్యాన్సిల్ చేసిన యువతిపై జొమాటో డెలివరీ బాయ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ డెలివరీ బాయ్ కామరాజ్ ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం కామరాజ్ బెయిల్ పై బయటకు వచ్చాడు. 

ఇక్కడే కొత్త ట్విస్ట్ ఇచ్చాడు కామరాజ్ తనపై కేసు నమోదైన పోలీస్ స్టేషన్ లోనే సదరు యువతిపై కేసు పెట్టాడు. యువతిపై దాడి చేసినట్లు వస్తున్న ఆరోపణలను కామరాజ్ ఖండించాడు. యువతిపై తాను దాడి చేయలేదన్నాడు. సదరు యువతినే తనను అసభ్య పదజాలంతో దూషించిందని తెలిపాడు. ఆర్డర్ ఆలస్యం అయినందుకు క్షమాపణలు కూడా చెప్పానన్నాడు. 

ఆహారాన్ని తిరిగి ఇవ్వాలని కోరినా ఆమె నిరాకరించిందని కామరాజ్ అన్నాడు. పైగా తనను అసభ్యపదజాలంతో దూషిస్తూ బూట్లు విసిరిందని చెప్పాడు. ఈక్రమంలో అనుకోకుండా తనను తానే గాయపరుచుకుందని పేర్కొన్నాడు. చివరకు తాను ఆమెపై దాడి చేశానని పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నాడు. వాస్తవానికి ఆమె తనను అవమానించిందని, అందుకే ఆమెపై కేసు పెట్టానని కామరాజ్ చెప్పుకొచ్చాడు. 

Leave a Comment