సంజనను పెళ్లి చేసుకున్న బుమ్రా..!

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వివాహం సోమవారం ఘనంగా జరిగింది. మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్ ని గోవాలో పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. తమ పెళ్లి ఫొటోలను బుమ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘మా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు. మా పెళ్లి వార్తను, ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. దీంతో బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

 కాగా, కరోనా నేపథ్యంలో ఈ వేడుకకు కేవలం 20 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం లభించింది. వివాహానికి ముందు జరిగే సంగీత్ కార్యక్రమం ఆదివారమే పూర్తయినట్లు వధూవరుల సన్నిహితులు తెలియజేశారు. అంతేకాదు ఈ వేడుకకు హాజరయ్యే అతిధులు మొబైల్ ఫోన్లను కూడా తీసుకురావద్దని బుమ్రా దంపతులు కోరినట్లు తెలిసింది.    

Leave a Comment