పునీత్ పై అవమానకర పోస్ట్.. నెటిజన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన మరణం యావత్ సినీ పరిశ్రమను విషాదంలో నెట్టింది. పేరుకు కన్నడ హీరో అయినా అందరితో ఎంతో సత్సంబంధాలు కొనసాగించేవారు. పునీత్ ఇక లేరని తెలిసి కన్నడ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ సహా ఎంతో మంది ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.  

అయితే దివంగత కన్నడు నటుడు పునీత్ రాజ్ కుమార్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకమైన పోస్ట్ ప్రత్యక్షమైంది. ఈ పోస్ట్ చేసిన యువకుడిని బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో బీర్ బాటిల్ తో అవమానకరమైన పోస్ట్ ను అప్ లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. 

కాగా పునీత్ మృతి నేపథ్యంలో నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం అమ్మకాలను నిషేధించారు. పునీత్ పై అవమానకరమైన పోస్ట్ చేయడానికి ఇదే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.    

Leave a Comment