సైకో కిల్లర్ ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..!

వరుసగా రెండు హత్యలు చేసిన సైకో కిల్లర్ ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మొదట హబీబ్ నగర్ లో నవంబర్ 1న ఓ హత్య, నాంపల్లిలో రెండో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. 

రెండు ప్రాంతాల్లోనూ యాచకులు ఇద్దరినీ తలపై రాయితో మోది చంపాడు. రెండు హత్యల్లో కూడా చంపడానికి ఉపయోగించిన ఆయుధం రాయే కాగా.. తలపై ఒకేలా కొట్టడం చూస్తుంటే.. కచ్చితంగా ఒకరే రెండు హత్యలు చేసి ఉంారని పోలీసులు భావించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.  

Leave a Comment