షాకింగ్ వీడియో : గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..!

‘ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవాల్సిందే ఎవరు శాశ్వతం కాదు కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది సత్యమే నిజమైనది శాశ్వతమైనది. ఏదిఏమైనా విధి రాసిన రాతను తప్పించడం ఎవ్వరి వల్ల కాదు’.. ఇది భగవద్గీతలోని ఓ వ్యాక్యం.   మరణం ఎప్పుడైనా, ఏసమయంలో రావచ్చు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలి తిరిగారాని లోకాలకు వెళ్లిపోయాడు.  గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చూస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది.

 గుత్తిలోని స్వీపర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పెద్ద కుళ్లాయప్ప అనే యువకుడు ఉప్పెన సినిమాలోని పాటకు హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే స్నేహితులు ఆ యువకుడ్ని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువకుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో పాటు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన స్నేహితుడు మరణించడంతో కాలనీ వాసులు, స్నేహితులు షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Leave a Comment