ప్రమాదకరంగా డీ2 డెంగ్యూ స్ట్రయిన్.. లక్షణాలు ఇవే..!

ప్రస్తుతం దేశంలో డెంగ్యూ వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ వైరల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ డెంగ్యూ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. మరణాలు కూడా సంభవిస్తున్నాయి దీనికి కారణం D2 డెండ్యూ స్ట్రయిన్ అని అధికారులు చెబుతున్నారు. డెండ్యూ వైరస్ లో ఉన్న నాలుగు విభిన్న స్ట్రయిన్ లలో ఇది కూడా ఒకటి.   

సాధారణంగా డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే దోమల వల్ల డెంగ్యూ జ్వరం కలుగుతుంది. ఈ వ్యాధి సోకిన మూడు నుంచి 14 రోజుల తర్వాత దీని లక్షణాలు ప్రారంభమవుతాయి. డెంగ్యూ అత్యంత ముఖ్యమైన, ప్రమాదకరమైన వైరల్ వ్యాధి అని, ఈ ఇన్ఫెక్షన్ అంతర్జాతీయ ప్రజారోగ్య సమస్యఅని నేషనల్ డిసీజ్ కంట్రోల్(ఎన్డీసీ), డబ్ల్యూహెచ్ఓ అభివర్ణించాయి. డెంగ్యూ వైరస్ అనేక అంటురోగాలకు కారణమవుతుందని, బాధితుల్లో చాలా వరకు తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయని, తీవ్రమైతే డెంగ్యూ ప్రాణాంతక సమస్యగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. 

డెంగ్యూ వైరస్ ను డెన్వీగా పిలుస్తారు. ఇది డెన్వీ-1, డెన్వీ-2, డెన్వీ-3, డెన్వీ-4 అనే నాలుగు రూపాల్లో ఉంటుంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న డెంగ్యూ కేసులు డెన్వీ-2 లేదా డీ2 వేరియంట్ ద్వారా వస్తున్నాయి. ఇది వ్యాధి తీవ్రతకు, మరణాల పెరుగుదలకు కారణమైంది. డెంగ్యూ పరిధి విస్తృతంగా ఉంటుంది. కొన్ని సార్లు తీవ్రమైన ఫ్యూ లక్షణాలు బారిన పడినట్లు కూడా ప్రజలకు తెలియకపోవచ్చు. కొంత మందికి తీవ్రమైన డెంగ్యూ వచ్చే అవకాశముంది. అయితే అలాంటి సమదర్భాలు చాలా తక్కువ.. తీవ్రమైన డెంగ్యూ ఇన్ఫెక్షన్ ను 1950లో ఫిలిప్పైన్స్, థాయ్ లాండ్ దేశాల్లో గుర్తించారు. అప్పుడు మరణాల శాతం ఎక్కువగా నమోదైంది. ప్రస్తుతం తీవ్రమైన డెంగ్యూ కేసులు దాదాపు అన్ని ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో కనిపిస్తున్నాయి. 

డీ డెంగ్యూ లక్షణాలు:

  • డెంగ్యూలో ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 2-7 రోజుల పాటు కొనసాగుతాయి. సాధారణంగా వైరస్ ఇంక్యుబేషన్ పిరియడ్ 4-10 రోజులు ఉంటుంది. క్లాసిక్ డెంగ్యూ జ్వరం సోకితే తలనొప్పి, వికారం, వాంతులు, వాపు, కండరాల నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • అదే డీ2 డెంగ్యూ లక్షణాల విషయానికొస్తే.. బాధితులు కొంత కాలం తర్వాత కోలుకుంటున్నట్లు కనిపిస్తాడు. కానీ 3-7 రోజుల తర్వాత పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం, రక్తం వాంతులు, వేగవంతమైన శ్వాస, అలసట లాంటి లక్షణాలు వీరికి ప్రమాదకరంగా మారుతాయి. అంతేకాకుండా ప్లాస్మా లేకేజ్, తీవ్రమైన రక్తస్రావం ఏర్పడి పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంది. 

డీ2 డెంగ్యూ చికిత్స:

  • డెంగ్యూకు వ్యాక్సిన్లు లేదా నిర్ధిష్ట చికిత్స లేదు. 
  • రోగుల లక్షణాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. 
  • ఏవైన లక్షణాలు కనిపిస్తేనే బాధితులు వైద్యుల సలహా తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. 
  • ఆహార విషయంలో శ్రద్ధ పెట్టాలి. లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. 
  • జ్వరం, కీళ్ల నొప్పులు తగ్గించడానికి పారాసిటెమాల్ తీసుకోవాలి. అయితే ఆస్పిరిన్ లేదా ఇబుప్రొఫెన్ మందులు తీసుకోకూడదు. ఇవి రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి.
  • సరైన వైద్య సంరక్షణ తీసుకుంటే డెంగ్యూ నుంచి బయటపడవచ్చు. 

Leave a Comment