ఆవు, గేదె పాలలో ఏది మంచిది..?

ప్రతిరోజూ ఓ గ్లాస్ పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. పాలలో చాలా పోషకాలు ఉన్నాయి. పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. గ్రామాల్లో వారి వద్ద ఉన్న పాడి జంతువులను బట్టి కొందరు ఆవు పాలు లేదా గేదె పాలు తీసుకుంటారు. ఆవు పాలు, గేదె పాలు రెండు మనకు దొరుకుతాయి. అయితే ఆవు పాలు, గేదె పాలలో ఏదీ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆవు పాలు, గేదె పాల మధ్య తేడా:

  • గేదె పాలు కంటే ఆవు పాలలో తక్కువ కొవ్వు ఉంటుంది. 
  • ఆవు పాలు సులభంగా జీర్ణం అవుతుంది. 
  • ఆవు పాలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. 
  • గేదె పాలలో అయితే భాస్వరం, కాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా లభిస్తాయి. 
  • ఆవు పాలలో కొవ్వు కాస్త తక్కువగా ఉంటుంది. గేదె పాలలో 7 నుంచి 8 శాతం అధికంగా కొవ్వు ఉంటుంది. 
  • ఆవు పాలలో కంటే గేదె పాలలో ప్రోటీన్లు 10 నుంచి 11 శాతం ఎక్కువగా లభిస్తాయి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే గేదె పాలు తీసుకోవడం బెటర్. అదే ప్రోటీన్స్ తక్కువగా కావాలనుకుంటే ఆవు పాలని తీసుకోండి.  
  • గేదె పాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి మరియు ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలకు చాలా మంచిది. 
  • గేదె పాలలో ఆవు పాల కంటే కేలరీలు అధికంగా ఉంటాయి. ఒక లీటర్ గేదె పాలలో 237 కేలరీలు లభించగా, అదే ఆవు పాలలో 148 కేలరీలు లభిస్తాయి. 
  • ఇక గేదె పాలను ఎక్కవ కాలం నిల్వ చేసుకుని తాగవచ్చు. అదే ఆవు పాలను ఒకటి రెండు రోజుల్లో తాగేయాలి. 
  • మీరు చక్కగా నిద్ర పోవాలంటే కచ్చితంగా గేదె పాలను తీసుకోవడం మంచిది.

అయితే రెండు పాలు కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే ఇక్కడ ఉన్న తేడాలను బట్టి మీకు ఏదీ బెస్ట్ అనిపిస్తే అది తాగండి. జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవారు గేదె పాలు తాగవచ్చు. మరీ బలహీనంగా ఉన్నవారు కొవ్వులు, ప్రోటీన్ల కోసం గేదె పాలు తీసుకోవచ్చు. రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు ఆవు పాలు తాగడం ఉత్తమం.. కానీ ప్రతిరోజూ పాలను తాగడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే పాల వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

Leave a Comment