ఐదుగురి ప్రాణాలు కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!

తాను చనిపోతూ ఐదుగురు ప్రాణాలను నిలిపింది ఓ ఆరేళ్ల చిన్నారి.. నోయిడాలో ఏప్రిల్ 27న రోలీ ప్రజాపతి అనే ఆరేళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా. గుర్తుతెలియన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుల్లెట్ చిన్నారి తలలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

కుటుంబ సభ్యులు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పాప బ్రెయిన్ డెడ్ కావడంతో పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించారు వైద్యులు.. దీంతో రోలి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. 

చిన్నారి కాలేయం, మూత్రపిండాలు, కార్నియా, గుండె వాల్వ్ ను వేర్వేరు వ్యక్తులకు వైద్యులు అమర్చారు. దేశంలోనే యంగెస్ట్ ఆర్గాన్ డోనర్ గా రోలి నిలిచింది. తమ పాప చనిపోయినా బతికి ఉండాలనే ఉద్దేశంతోనే అవయదానం చేసినట్లు రోలీ తండ్రి హరనారాయణ్ తెలిపారు. రోలీ తల్లిదండ్రులను ఎయిమ్స్ వైద్యులు అభినందించారు.    

 

 

 

Leave a Comment