ప్రియుడితో భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న జవాన్..!

భర్త దేశ రక్షణ కోసం 24 గంటలు సరిహద్దులో కాపలా కాస్తంటే.. భార్య మాత్రం పాడు పనులు చేస్తోంది.. గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడితో రాసలీలలు నడుపుతోంది. భర్త అకస్మాత్తుగా రావడంతో అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ లోని రహమత్ నగర్ లో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు యాదగిరి నగర్ లో జవాన్ మధుసూదన్ భార్య ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. భర్త సరిహద్దుకు వెళ్లడంతో.. ప్రియుడినే భర్తగా పరిచయం చేసి ఇల్లు అద్దెకు తీసుకుంది. ఎవరికీ అనుమానం రాకుండా రాసలీలు సాగిస్తోంది. అయితే భార్య ప్రవర్తనపై జవాన్ మధుసూదన్ కి సమాచారం అందింది.. 

దీంతో మధుసూదన్ ఎవరికీ సమాచారం లేకుండా అకస్మాత్తుగా హైదరాబాద్ వచ్చాడు. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అనంతరం వారిని ఇంట్లోనే బంధించి తాళం వేశాడు. భార్య, ఆమె ప్రియుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జవాన్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.   

Leave a Comment