మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు.. ఇన్ స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించిన యువకుడు..!

మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు ఓ యువకుడు పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఖుషీ నగర్ లో ఓ యువకుడు మాస్క్ లేకుండా వెళ్తున్నాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ ఆ యువకుడిని ఆపీ జీపులో ఉన్న ఇన్ స్పెక్టర్ దగ్గరకు పంపాడు. ఆ ఇన్ స్పెక్టర్ ఆ యువకుడి కాలర్ పట్టుకొని మాస్క్ పెట్టుకోమని ఇంతలా చెబుతుంటే ఎందుకంత నిర్లక్ష్యం.. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అని పైర్ అయ్యాడు. 

దీంతో ఆ యువకుడు సరే సార్ పెట్టుకుంటాను అని చెప్పడంతో అతనికి ఫైన్ వేయకుండా వదిలాడు ఇన్ స్పెక్టర్.. అంతే ఆ క్షణంలో ఆ యువకుడు ఇన్ స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో ఇన్ స్పెక్టర్ షాక్ అయ్యాడు. పట్టుకునే సరికి అక్కడి నుంచి పారిపోయాడు. అతడ్ని పట్టుకుందామని పరిగెత్తిన కానిస్టేబుల్ కి అతన్ని పట్టుకోవడం కుదరలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment