రెమ్ డెసివిర్ కు బదులు నీళ్ల ఇంజెక్షన్ చేశారు..మృతి చెందిన రోగి..!

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ కు బదులు ఒక రోగికి నీళ్లతో ఇంజెక్షన్ చేశారు. దీంతో ఆ రోగి మరణించాడు. ఈ ఘటన మీరట్ లో చోటుచేసుకుంది. ఈ కేసులో మీరట్ లోని సుభార్తి మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘజియాబాద్ లోని కావినగర్ లో నివసిస్తున్న శోభిత్ జైన్ ను సుభార్తి మెడికల్ కాలేజీలోని కోవిడ్ వార్డులో చేర్చారు. 

శోభిత్ జైన్ కు అక్కడి సిబ్బంది రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చారు. శుక్రవారం రోగి శోభిత్ జైన్ చనిపోయాడు. దీనిపై పోలీసు నిఘా టీమ్ దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారించగా.. రెమ్ డెసివిర్ కు బదులుగా డిస్టిల్ వాటర్ ను ఇంజెక్ట్ చేసినట్లు వారు తెలిపారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు సుభార్తి మెడికల్ కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. 

Leave a Comment