ఘోరం..90 ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం..!

కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు చిన్నపిల్లలను, పండు ముసలి వాళ్లును కూడా వదలడం లేదు. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ యువకుడు 90 ఏళ్ల వృద్ధురాలిపై  అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని నజఫ్ నగర్ లోని చావ్లా ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..నజఫ్ నగర్ లోని చావ్లా ప్రాంతంలోని ఓ ఇంట్లో 90 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. సోమవారం సాయంత్రం పాలు పోసే వ్యక్తి కోసం ఆమె ఇంటి ముందు ఎదురుచూస్తుంది. దీనిని ఆ వృద్ధురాలి పక్కంట్లోని యువకుడు గమనించాడు. ఆమె వద్దకు వెళ్లి ఈ రోజు పాలవాడు రావడం లేదు, దగ్గర్లోని డెయిరీకి వెళ్లి పాలు తెచ్చుకుందామని చెప్పాడు. ఆమె సరే అని చెప్పడంతో ఆమెను బైక్ పై ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. 

అక్కడ ఆ యువకుడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా వృద్ధురాలు ప్రతిఘటించింది. దీంతో ఆమెను కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ వృద్ధురాలు ఏడుపులు మొదలుపెట్టింది. దారిన వెళ్లేవాళ్లు ఆమె ఏడుపులు విని దగ్గరగా వెళ్లగా వారిని చూసి ఆ యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకుని దేహశుద్ది చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Leave a Comment