చనిపోయేంత వరకు ఇద్దరు మగవారే అని తెలీదు..!

మధ్యప్రదేశ్ లోని సెహూర్ లో ఓ జంట ఎనిమిది సంవత్సరాలుగా భార్యాభర్తలుగా కలిసి జీవించేవారు. 2012లో ఇద్దరూ ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు ఒక పిల్లాడిని దత్తత తీసుకున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఆనందంతో సాగుతున్న వారి వైవాహిక జీవితంలో గతనెల ఆగస్టు 11న చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత భార్య తనను తాను నిప్పు అంటించుకుంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్తకు కూడా మంటలు అంటుకున్నాయి.

మంటల్లో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని భోపాల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే శరీరం పూర్తిగా కాలిపోవడంతో భార్య ఆగస్టు 12న మరణించగా, భర్త ఆగస్టు 16న మరణించాడు. అయితే పోస్టు మార్టం సమయంలో తీసిన అటాస్పీ రిపోర్టులో వైద్యులు ఇద్దరు మగవారే అని షాకింగ్ న్యూస్ చెప్పారు. అంతే దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. చనిపోయిన భార్య పూర్తి రిపోర్టులో ఆమె అమ్మాయి కాదని, అబ్బాయేనని వచ్చింది. 

పోలీసులు చనిపోయిన భర్త అన్నయ్యను విచారించగా..తన తమ్ముడు ఎల్జబీటీ ఉద్యమానికి మద్దతుగా పోరాటం చేసేవాడని, అక్కడ అతనికి ఒక గే పరిచయమయ్యాడని చెప్పాడు. వారిద్దరు పెళ్లి చేసుకోవడం ఇంట్లో వారికి ఇష్టం లేదని, దీంతో తమకు దూరంగా వెళ్లి పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు. అయితే వారు నిజమైన భార్యభర్తలుగా ఉండేవారని, చనిపోయేంతవరకు వారు స్వలింగ సంపర్కులన్న అనుమానం కలగలేదని స్థానికులు చెప్పారు. 

  

Leave a Comment