స్మార్ట్ ఫోన్ కి బానిసై.. గతం మర్చిపోయిన యువకుడు..!

నేటి యువత స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారిపోయింది. క్షణం తీరక లేకుండా తిండి, నిద్ర మానేసి మొబైల్ ఫోన్ ని ఓ వ్యసనంగా మార్చుకుంటున్నారు.  ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్ లలో గంటల తరబడి గడిపేస్తున్నారు. తాజాగా స్మార్మ్ ఫోన్ కి బానిసై ఓ యువకుడు గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కన్న తల్లిదండ్రులను సైతం గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు. 

రాజస్తాన్ లోని చూరు జిల్లాలోని సహ్వా టౌన్ కి చెందిన అక్రమ్(20) అనే యువకుడు ఎలక్ట్రికల్ వైడనింగ్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే గత నెల రోజులుగా అక్రమ్ మొబైల్ తో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయ్యి చేస్తున్న పని కూడా మానేశాడు. 

కొన్ని రోజులుగా రాత్రంతా మొబైల్ లో చాట్ చేయడం, గేమ్ లు ఆడటం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా మొబైల్ చూడటం మానలేదు. తినడం, తాగడం కూడా మానేశాడని అక్రమ్ తల్లి చెప్పింది. అంతేకాకుండా గత ఐదు రోజులుగా నిద్ర కూడా పోవడం లేదట. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు భార్టియా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ప్రస్తుతం సైకియాట్రిస్టులు వైద్యం అందిస్తున్నారు.   

 

Leave a Comment