ముహూర్తానికి ముందు పెళ్లి దుస్తులతో వెళ్లి పరీక్ష రాసిన వధువు..!

వ్యక్తి జీవితంలోనూ.. మొత్తం సమాజంలోనూ విద్య విలువైన సాధనం.. విద్య కంటే ముఖ్యమైంది ఏదీ లేదు..  చదువు అనేది ఎంతో ఆవశ్యకమో ఈ అమ్మాయి నిరూపించింది.. తన పెళ్లిని కొన్ని గంటలు వాయిదా వేసి మరీ పరీక్షకు హాజరైంది.. పెళ్లి బట్టలతోనే వెళ్లి పరీక్ష రాసింది. ప్రస్తుతం ఈ వధువు పరీక్ష రాస్తున్న ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

గుజరాత్ లోని రాజ్ కోట్ కి చెందిన శివంగి బాగ్తారియా శాంతి నికేతన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ లో డిగ్రీ చదువుతుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ముహూర్తం పెట్టే సమయానికి ఆమె ఐదో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించలేదు. దీంతో వారు ముహూర్తాన్ని ఖారారు చేసుకున్నారు. 

అయితే పెళ్లి ముందు పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. సరిగ్గా ముహూర్తం తేదీన పరీక్ష కూడా ఉంది. దీంతో ముహూర్తాన్ని సర్దుబాటు చేయాలని ఆమె తల్లిదండ్రులను, తనకు కాబోయే భర్త కుటుంబాన్ని కోరింది. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి ముహూర్తం సమయాన్ని సర్దుబాటు చేశారు. పరీక్ష అయ్యాకే పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో ఆ వధువు పెళ్లి బట్టలతోనే పరీక్ష హాలుకు హాజరై ఐదో సెమిస్టర్ పరీక్ష రాసింది.

 పరీక్ష, పెళ్లి ఒకే తేదీన ఉండడంతో ముందుగా పెళ్లి ముహూర్తాన్ని రద్దు చేయాలని అనుకున్నామని, తర్వాత చర్చించుకొని ముహూర్తం సమయాన్ని సర్దుబాటు చేశామని బాక్తారియాకు కాబోయే భర్త చెప్పారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Comment