‘కరోనా దేవీ’ కరుణించు..కేరళలో ఓ భక్తుడు పూజలు..

ఒక వైపు కరోనా వేల మంది ప్రజల ప్రాణాలు బలిగొంటుంది..మరో వైపు కరోనాకు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తంటాలు పడుతున్నారు. అయితే ఓ భక్తుడు మాత్రం కరోను నిత్యం పూజిస్తున్నాడు. అందరిపై కరుణ చూపాలని వేడుకుంటున్నాడు. కేరళలోని కడక్కల్ లో నివసించే అనిలన్ ధర్మకోల్ తో కరోనా వైరస్ చిత్రాన్ని తయారు చేసి ప్రార్థిస్తున్నాడు. 

అయితే కరోనాకు పూజలు చేస్తున్న విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో చాలా మంది ప్రజల ప్రాణాలు బలిగొంటున్న కరోనాను పూజించడం ఏంటని విమర్శిస్తున్నారు. మరి కొందరు మాత్రం అతను పబ్లిసిటీ కోసం ఇలాంటి పూజలు చేస్తున్నాడని తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మూఢ నమ్మకాలు ఎక్కువయ్యాయని మరి కొందరు కామెంట్లు చేయడం జరుగుతోంది. 

అనిలన్ మాత్రం తనపై వస్తున్న విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 33 కోట్ల హిందూదేవతల్లో కరోనా దేవీ కూడా ఒకరని, నచ్చిన దైవాన్ని పూజించడం తన హక్కని తనను సమర్థించుకుంటున్నాడు. అయితే తన ఇంట్లో పూజలకు ఇతరులకు మాత్రం అనిలన్ అనుమతించడం లేదు. 

Leave a Comment