‘ధోనీ’ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య..

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్(34) ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో బాలీవుడ్ షాక్ కు గురైంది. అయితే సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

టెలివిజన్ షోలతో తన కెరీర్ ప్రారంభించిన సుశాంత్ బాలీవుడ్ అగ్ర నటుడిగా ఎదిగాడు. తాను నటించిన ఎన్నో చిత్రాలు హిట్ సాధించాయి. బాలీవుడ్ లో సుశాంత్ ‘కోయ్ పో చి’తో  కెరీర్ ను ఆరంభించాడు. ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, పీకే, డిటెక్టీవ్, బొమ్ కేష్ బక్షి, ఎం.ఎస్.ధోని, రాబ్టా, వెల్ కమ్ న్యూయార్క్, కేదార్ నాథ్, సోంచారియా, చిచ్చోర్, డ్రైవ్ తదితర సినిమాల్లో నటించాడు. అయితే భారత క్రికెటర్ ఎం.ఎస్.ధోని జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘ఎం.ఎస్.ధోని.. ద అన్ టోల్డ్ స్టోరీ’ సినిమాతో తన కెరీర్ మారిపోయింది. ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

సుశాంత్ చివరి సారిగా నటించిన చిత్రం ‘దిల్ బేచారా’ లాక్ డౌన్ కారణంగా రిలీజ్ కాలేదు. అయితే ఈ సినిమాలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పలువురు టెక్నీషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఆరు రోజుల క్రితం సుశాంత్ సింగ్ వద్ద మేనేజర్ గా పనిచేసిన దిశ సలియా కూడా భవనంలోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు కూడా తెలియరాలేదు. 

సుశాంత్ మరణం వార్త విన్న పలువురు బాలీవుడ్ నటులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్, రితేష్ దేశ్ ముఖ్ తదితరులు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. 

 

Leave a Comment