65 ఏళ్లుగా స్నానం చేయలేదు.. అత్యంత మురికి మనిషిగా రికార్డు..!

ప్రతి రోజు స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని చాలా చెబుతారు. కానీ ఈ వ్యక్తి తాను స్నానం చేయకపోతేనే ఆరోగ్యంగా ఉంటానని 65 ఏళ్లుగా స్నానం చేయడం మానేశాడు. అతనే ఇరాన్ కు చెందిన 83 ఏళ్ల అమౌ హాజీ.. దీంతో అతను ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా రికార్డుల్లోకెక్కాడు.  

ఇరాన్ లోని దెజ్ అనే ప్రాంతంలో నివసిస్తున్న హాజీ 20 ఏళ్లు ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాడు. ప్రతి రోజూ స్నానం చేయడం వల్లే తన ఆరోగ్యం దెబ్బతిందని భావించాడు. దీంతో అప్పటి నుంచి స్నానం చేయడమే మానేశాడు. అతనికి సొంత ఇల్లు లేదు. ఎడారిలో అక్కడక్కడా కనిపించే గుహల్లో కాలం వెల్లదీస్తుంటాడు. 

దగ్గర్లోని ఊళ్లో వాళ్లు తన కోసం ఓ గుడిసెను కట్టి ఇచ్చానా అందులో ఉండటానికి హాజీ ఇష్టపడటం లేదు. కుళ్లిపోయిన అడవిపంది మాంసాన్ని చాలా ఇష్టంగా తింటాడు. రోజుకు ఐదు లీటర్ల నీటిని మాత్రం తాగుతుంటాడు. అంతే కాదు తనకు పొగతాగడం అంటే చాలా ఇష్టం. ఒక వేళ సిగరెట్ అందుబాటులో లేకపోతు జంతువుల వ్యర్థాలనే చుట్టలా కాల్చుకుని తాగుతాడు. ఇంత అపరిశుభ్రంగా, మురికిగా ఉన్నప్పటికీ హాజీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు.  

 

Leave a Comment