సీఎం జగన్ తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ

అమరావతి : సచివాలయంలోని సీఎం కార్యాలయలంలో మంగళవారం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో  ప్రపంచబ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏపీలో జగన్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించినట్లు సీఎంఓ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రపంచబ్యాంకు బృందానికి సీఎం జగన్ వివరించారు.  విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ప్రశంసలు చేశారు. మానవవనరులపై పెట్టబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయని ప్రపంచ బ్యాంకు బృందం అభిప్రాయపడినట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని ప్రపంచబ్యాంకు బృందం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని వెల్లడించినట్లు సీఎంఓ తెలిపింది. 

Leave a Comment