ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు చెప్పిన వండర్ కిడ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఓ చిన్నారి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 346 చిత్రాల పేర్లను కేవలం 5 నిమిషాల్లో చెప్పింది. కృష్ణ తొలి చిత్రం ‘తేనె మనసులు’ నుంచి చివరి చిత్రం వరకు నాన్ స్టాప్ గా చెప్పేసి తన ప్రతిభను చాటింది. విజయవాడకు చెందిన పదేళ్ల మున్నంగి హాసిని ఐకాన్ పబ్లిక్ స్కూల్ లో ఐదో తరగతి చదువుతోంది. 

సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయోత్సవం సందర్భంగా మహేష్ బాబు ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి 350 సినిమాల్లో నటించారని, ఆ చిత్రాల పేర్లు వరుసగా ఎవరైనా చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. దీంతో హాసిని కృష్ణ నటించిన చిత్రాల పేర్లను వారం రోజుల్లో కంఠస్తం చేసింది. శనివారం అలంకార్ థియేటర్ లో ప్రదర్శన నిర్వహించింది. సూపర్ స్టార్ కృష్ణ తొలిచిత్రం ‘తేనె మనసులు’ నుంచి అవి విడుదల అయిన క్రమంలో 346 చిత్రాల పేర్లను చెప్పి అబ్బురపరిచింది. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు గిఫ్ట్ గా ఈ ప్రదర్శన చేపట్టినట్లు హాసిని తల్లదండ్రులు చెప్పారు. 

Leave a Comment