అయోధ్యలో బాబ్రీ హాస్పిటల్? వాస్తవమేనా?

ఇటీవల అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమం మిగిశాక కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సుప్రీం కోర్టు అయోధ్యలో ముస్లింలకు కేటాయించిన 5 ఎకరాల భూమిలో ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయించిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి బాబ్రీ హాస్పిటల్ పేరుపెడుతున్నట్లు అందులో ఉంది. డాక్టర్ కఫీల్ ఖాన్ ఆ ఆస్పత్రికి డైరెక్టర్ గా ఉంటారని పోస్ట్ సారాంశం. అందుకు సంబంధించి గ్రాఫిక్ డిజైన్ కూడా జత చేశారు. అయితే ఆ వార్తలో వాస్తవమెంత ఉంది. 

అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవమని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు తమకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో ఏం నిర్మించాలనే దాని గురించి ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బోర్డు స్పష్టం చేసింది. కానీ సున్నీ వక్ఫ్ బోర్డు బాబ్రీ హాస్పిటల్ పేరుతో వస్తున్న ఈ వార్తను నిజమో..కాదో తెలుసుకోకుండా పలువురు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 

Leave a Comment