మహిళల టీ20 వరల్డ్ కప్ ఆసీస్ దే..!

 టీమిండియాకు ఘోర పరాభవం

ఆస్ట్రేలియా మహిళల జట్టు అదరగొట్టింది. మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను చిత్తు చేసింది. మెల్ బోర్న్ లో జరిగిన ఫైనల్ పోరులో ఆసీస్ 85 పరుగుల తేడాతో టీమిండియా మహిళల జట్టుపై గెలపొందింది. 185 పరుగుల లక్ష్యం అందుకునే క్రమంలో టీమిండియా 99 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.19.1 ఓబర్ల వద్ద తన ప్రస్థానం ముగించింది.

మిడిలార్డర్ లో దీప్తి శర్మ చేసిన 33 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. స్టార్లుగా భావించిన అందరూ దారుణంగా విఫలమయ్యారు. దీప్తి శర్మ, వేదా క్రిష్ణమూర్తి(19), రిచా ఘోష్(18) ఓ మోస్తరు పోరాటం కనబర్చడంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది.

ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఓపేనర్ అలిస్సా హేలీ హాఫ్ సెంచరీతో రాణించింది. ఆసీప్ ఓపెనర్లు పవర్ ప్లేను బాగా ఉపయోగించుకున్నారు. మొదటి 115 పరుగుల భాగస్వామ్యంతో అదరగొట్టారు. అలిస్సా(75) పరుగులు చేసింది. అయితే అప్పటి వరకు మరో ఓపెనర్ బెత్ మూనీ తనకు స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చింది. అయితే తరువాత వచ్చిన ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ (16) పరుగుల వద్ద ఆవుట్ అయింది.

వెంటనే అదే ఓవర్లో ఆష్లీ గార్డ్ నర్ (2), కొద్ది సేపటికే రేచల్ హేన్స్ వెంట వెంటనే వెనుదిరిగారు. అయితే వచ్చిన వారందరూ వెనుదిరుగుతున్నా ఓపెనర్ మూనీ(78) చివరి వరకు నిలబడి అద్భుతంగా రాణించి జట్టు స్కోరును పెంచింది. ఓపెనర్లు ఇద్దరు రాణించడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అయితే భారత బౌలర్లలో దీప్తి శర్మ 2, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ తల ఒక వికెట్ తీసుకున్నారు. 

 

Leave a Comment