ఇదెక్కడి ఫ్యాషన్ రా నాయనా.. హెయిర్ బ్యాండ్ గా బతికున్న పాము.. షాకింగ్ వీడియో..!

మహిళలు స్టయిల్ గా కనిపించేందుకు కొత్త కొత్త ఫ్యాషన్ ను ఫాలో అవుతుంటారు. ఎప్పటికప్పుడు వారు అప్ డేట్ అవుతుంటారు. రకరకాల దుస్తులు, హెయిర్ స్టయిల్ మెయిన్ టేన్ చేస్తుంటారు. అందరిలో స్పెషల్ గా కనిపించాలని ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో ఓ మహిళ కొత్తగా ఆలోచించింది.. 

తాజాగా ఓ మాల్ కు షాపింగ్ కు వెళ్లిన మహిళ తన స్టయిల్ తో అందర్నీ షాక్ కి గురిచేసింది. సాధారణంగా మహిళలు హెయిర్ బ్యాండ్ గా పిన్ లేదా రబ్బర బ్యాండ్ వేసుకుంటారు. కానీ ఈ మహిళ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. తల కొప్పుకు పామును చుట్టుకొని షాపింగ్ మాల్ కు వచ్చింది. 

ముందుగా ఆమె వేసుకున్న హెయిర్ బ్యాండ్ చూడటానికి ఆకర్షణీయంగా ఉందని అందరూ అనుకున్నారు. పాము ఆకారంలో ఉన్న హెయిర్ బ్యాండ్ నిజంగానే రబ్బర్ బ్యాండ్ అనుకొని ఫొటోలు, వీడియో తీసుకున్నారు. కానీ అది కదలటం మొదలు పెట్టగానే అందరూ పరుగులు తీశారు. ఇదెక్కడి ఫ్యాషన్ రా నాయనా అంటూ అనుకుంటుననారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.   

  

 

View this post on Instagram

 

A post shared by Snakes Mania (@snakes.mania)

Leave a Comment