చిరంజీవి కోసం 726 కి.మీ. పాదయాత్ర చేసిన దివ్యాంగ అభిమాని..!

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. చిరంజీవి కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడతారు. తాజాగా ఓ దివ్యాంగ అభిమాని చిరంజీవిని కలిసేందుకు సాహసం చేశాడు. సుమారు 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి హైదరాబాద్ వచ్చి చిరంజీవిని కలుసుకున్నాడు. 

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్ చిరంజీవికి డైహార్డ్ ఫ్యాన్.. చిరంజీవి నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి కోసం పాదయాత్ర చేయాలనుకున్నాడు. చిరంజీవిని కలిసేందుకు గంగాధర్ అక్టోబర్ 3న అమలాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించాడు. 23 రోజుల 726 కిలోమీటర్లు నడిచి సోమవారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి చేరుకున్నాడు. 

ఈ విషయం తెలిసి చిరంజీవి చలించిపోయారు. వెంటనే గంగాధర్ ను తన ఇంటికి పిలిపించుకొని అతడితో మాట్లాడారు. అనంతరం గంగాధర్ గురించి తెలుసుకున్నారు. ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. అయితే చిరంజీవిని కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.  

 

Leave a Comment