ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ.1.50 మాత్రమే.. ఎక్కడో మీకు తెలుసా?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు పెట్రో ధరలను భారీగా పెంచేశాయి. దేశంలో ఇప్పటి లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటేసింది. అయితే కొన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు చాలా చీప్ గా ఉన్నాయి. నీళ్ల బాటిల్ కంటే తక్కువగా లభిస్తున్నాయి. 

ప్రపంచంలోకెల్లా అతి తక్కువ ధరకు పెట్రోల్ లభించే దేశం పేరు వెనుజువెలా. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న లాటిన్ దేశం.. ఈ దేశంలో చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వెనుజువెలాలో లీటర్ పెట్రోల్ ధర 0.02 డాలర్లు అంటే మన కరెన్సీలో కేవలం రూ.1.50 మాత్రమే.. చమురు నిల్వలు ఎక్కువగా ఉండటంతో తమ పౌరులకు ఈ దేశం అత్యంత చవగ్గా పెట్రోల్, డీజిల్ అందిస్తోంది. 

పెట్రోల్ తక్కువగా అందిస్తున్న దేశాలు..

  • వెనుజువెలా తర్వాత పెట్రోల్ ను అతి తక్కువ ధరకు అందిస్తున్న దేశం ఇరాన్.. ఇరాన్ లో లీటర్ పెట్రోల్ ధర 0.06 డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.4.51 మాత్రమే..   
  • సిరియాలో పెట్రోల్ ధర 0.23 డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.17..
  • వీటి తర్వాత అంగోలా, అల్జేరియా, కువైట్, నైజీరియా, తుర్క్ మెనిస్తాన్, ఖచకిస్తాన్, ఇథియోపియాా దేశాల్లో 0.50 డాలర్లో లోపే ఉంటుంది. అంటే మన కరెన్సీలో రూ.40 లోపే లీటర్ పెట్రోల్ దొరుకుతుంది.

పెట్రోల్ మోత మోగిస్తున్న దేశాలు..

  • పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో హాంగ్ కాంగ్ మొదటి స్థానంలో ఉంది. ఇటీవల హాంగ్ కాంగ్ లో లీటర్ పెట్రోల్ ధర 2.56 డాలర్లుగా.. అంటే మన కరెన్సీలో రూ.192గా నమోదైంది. 
  • దీని తర్వాత నెదర్లాండ్స్ లో లీటర్ పెట్రోల్ ధర 2.18 డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.163..
  • సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ లో లీటర్ పెట్రోల్ ధర 2.14 డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.160.
  • వీటి తర్వాత నార్వే, ఇజ్రాయిల్, డెన్మార్క్, మోనాకో, గ్రీస్, ఫిన్ లాండ్, ఐస్ లాండ్ లలో లీటర్ పెట్రోల ధర రూ.150కి పైగానే ఉంది.
  • ఇక మన దేశంలో అయితే లీటర్ పెట్రోల్ ధర రూ.111 గా ఉంది.

పెరుగుదల ఎందుకు?

చమురు ఉత్పత్తుల్లో డిమాండ్, సప్లయ్ మధ్య తేడాలు రావడంతో ధరలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్సైజ్ డ్యూటీని విధిస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులేకుండా పోతున్నాయి. 2020 మేలో లీటర్ పెట్రోల్ ధర రూ.75 దగ్గర ఉంది. ప్రస్తుతం రూ.111 లుగా ఉంది. అంటే దాదాపు ఏడాదిన్నరలో రూ.36 పెరిగింది. అయితే క్షేత్ర స్థాయిలో చూసుకుంటే 2014లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 109 డాలర్లు ఉంది. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.71 లుగా ఉంది. 2021 అక్టోబర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్లు మాత్రమే ఉన్నా.. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.110 దాటేసింది..  

Leave a Comment