Viral Video : చేతి కర్రతో చిరుతను తరిమికొట్టిన వృద్ధురాలు..!

ఎవరికైనా హఠాత్తుగా చిరుత ఎదురైతే  భయంతో వణికిపోతారు. కానీ ఈ వృద్దురాలు మాత్రం ధైర్యంగా ఎదుర్కొంది.  తన చేతి కర్రతో ఆ చిరుతను తరిమికొట్టింది. ఈ ఘటన ముంబాయి శివారులోని ఆరే కాలనీలో వెలుగు చూసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కాలనీకి చెందిన నిర్మలాదేవీ సింగ్ అనే వృద్ధురాలు చేతి కర్ర సాయం లేనిదే నడవలేని పరిస్థితి. బుధవారం రాత్రి చేతి కర్ర పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటి ప్రాంగణంలో కూర్చుంది. అప్పటికే అక్కడ చిరుత ఉన్న విషయాన్ని నిర్మిలాదేవీ గుర్తించలేదు. అక్కడ కూర్చున్న ఆమెపై చిరుత ఆకస్మాత్తుగా దాడి చేసింది. ఆసమయంలో ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ఆమె వద్ద ఉన్న చేతి కర్రతో చిరుతను ప్రతిఘటించింది. దీంతో కొద్ది సేపటికి చిరుత అక్కడి నుంచి పరారైంది. చిరుత దాడిలో ఆమెకు స్వల్పగాలయ్యాయి. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

ఈ ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు చిరుత దాడి చేసింది. రెండు రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటున్న ఓ నాలుగేేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ బాలుడ్ని రక్షించారు. అయితే ఆరే కాలనీ ముంబాయి శివారు ప్రాంతంలో ఉంటుంది. చుట్టూ అటవీ ప్రాంతం కూడా ఉంది. దీంతో ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి.. 

Leave a Comment