ప్రమాదం జరిగితే మనుషులు పట్టించుకోలేదు.. స్మార్ట్ వాచ్ కాపాడింది..!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని మనుషులు ఎవరూ పట్టించుకోలేదు.. కానీ అతని చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ మాత్రం అతని ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన సింగపూర్ అంగ్ మో కియో పట్టణంలో సెప్టెంబర్ 25న జరిగింది. మహముద్ ఫిట్రీ(24) అనే వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు. సాయంత్రం 7.30 గంటల సమయంలో పట్టణంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢికొట్టంంది. ప్రమాదానికి గురై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే జనాలు ఎవరూ సాయం చేయలేదు. కనీసం అంబులెన్స్ కూ కూడా కాల్ చేయలేదు. 

ఆ టైమ్ లో అతని చేతికున్న స్మార్ట్ వాచ్ ఫాల్ అలర్ట్ చేసింది. అలర్ట్ ద్వారా సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రమాదం జరిగిన 30 నిమిషాలకు అక్కడికి చేరుకుంది. ఫిట్రీని ఆస్పత్రికి తరలించింది. సమయానికి చికిత్స అందడంతో ఫిట్రీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ యాపిల్ 4 సిరీస్ స్మార్ట్ వాచ్ ను అతని గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలిసింది.. 

ఈ స్మార్ట్ వాచ్ ఏం చేస్తుందంటే..

అతని చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ లో ఓ స్పెషల్ ఫీచర్ ఉంది. కాల్స్ కు, మెసేజ్ లకు వాచ్ ధరించిన వ్యక్తి స్పందించకపోతే ఆ వ్యక్తి ఆపదలో ఉన్నట్లు గుర్తించి ఎమర్జెన్సీ కాంటాక్ట్ లో ఉన్న నెంబర్లకు అప్రమత్తం చేస్తుంది. ప్రమాదానికి గురైనప్పుడు, ఏదైనా బలంగా ఢికొట్టినప్పుడు ఈ వాచ్ నుంచి ‘ఫాల్ అలర్ట్’ మోగుతుంది. యూజర్ ఒకవేళ దానిని ఆఫ్ చేయకపోతే అతడు ఆపదలో ఉన్నట్లు గుర్తించి.. అతని కాంటాక్ట్ లో ఉన్న లిస్ట్ కు కాల్స్, మెసేజ్ లు పంపిస్తుంది..

Leave a Comment