300 సార్లు తిరుమలకు కాలినడకన వెళ్లిన శ్రీవారి భక్తుడు..!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో దూరం నుంచి వస్తుంటారు. కాలినడకన వెళ్లాలనుకునే భక్తులు తిరుపతికి చేరుకుని అక్కడ అలిపిరి నడకదారి, శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు. అయితే, కాలినడకన 300 సార్లు తిరుమలకు చేరుకుని సిక్కోలు వాసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 

శ్రీకాకుళం నగరానికి చెందిన మహంతి శ్రీనివాసరావుకు కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో మక్కువ. కాలినడకన 300 సార్లు తిరుమలకు చేరుకుని తన భక్తిని చాటుకున్నారు. ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన స్థానం దక్కించుకున్నారు. 1996 నుంచి కాలినడకన తిరుమలకు వస్తున్న శ్రీనివాసరావు.. 54 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంగా తిరుమల కొండెక్కి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడం తన లక్ష్యమని, 300 సార్లు కాలినడకన తిరుమలకు రావాలన్న తన సంకల్పాన్ని పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషమని ఆయన తెలిపారు. అంతేకాదు తన భార్య సరస్వతి 53 సార్లు, కుమారుడు 27 సార్లు మెట్ల మార్గంలో వచ్చారని చెప్పారు.  

Leave a Comment