తప్పిపోయిన 76 మంది చిన్నారులను కనిపెట్టిన మహిళ పోలీస్..!

ఢిల్లీకి చెందిన సీమా ఢాకా అనే మహిళా కానిస్టేబుల్ తన ప్రతిభతో కేవలం మూడు నెలల్లో తప్పిపోయిన 76 మంది పిల్లల ఆచూకీని కనిపెట్టింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆమెకు నిబంధనలు పక్కన పెట్టి ప్రమోషన్ ఇచ్చారు. కానిస్టేబుల్ గా ఆమెను హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేేశారు. 

ప్రోత్సాహక పథకం కింద 3 నెలల్లో 76 మంది పిల్లలను గుర్తించి ఓటీపీ(అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్) పొందిన తొలి పోలీస్ గా సీమా ఢాకా నిలిచింది. ఆమెను ఢిల్లీలోని సమయ్ పూర్ బాడ్లీ పోలీస్ స్టేషన్ లో నియమించారు. ఆమె గుర్తించిన 76 మందిలో 56 మంది 14 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం.. అయితే ఆమె సేవలు ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సైతం ఆమెను ప్రత్యేకంగా పిలిపించి మిస్సింగ్ కేసులు అప్పగించాయి. ఆమె చేసిన సేవకు ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

 

Leave a Comment