కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోంది : సీఎం జగన్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ వస్తోందని, రాష్ట్రంలో మనం జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఇప్పటికే పలు దేేశాల్లో వ్యాపించిందన్నారు. స్పందనలో భాగాంగా కోవిడ్-19 నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ మరోసారి లాక్ డౌన్ కు సిద్ధమవుతోందన్నారు. 

కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి చెందడం ద్వారా యూరప్ వణుకుతోందన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేేశాల్లో సెకండ్ వేవ్ వ్యాపిస్తోందన్నారు. ఫ్రాన్స్, లండన్ లో షట్ డౌన్ చేశారని, అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోందని అన్నారు. అక్కడ మొదలు కాగానే మన దేశంలో వస్తోందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గినా, సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి జిల్లాల కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 

Leave a Comment