శానిటైజర్ ఎంత పని చేసిందో తెలుసా?

కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ శానిటైజర్లను విరివిగా వాడుతున్నారు. అయితే శానిటైజర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తునే ఉన్నారు. అలాంటి శానిటైజర్ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రమాదవశాత్తు శానిటైజర్ బాటిల్ పేలడంతో ఆమె శరీరం మొత్తం కాలి ముఖానికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది. 

కరోనా వైరస్ కారణంగా కేట్ వైడ్ అనే మహిళా ప్రతి రోజూ శానిటైజర్ రాసుకునేది. ప్రతి రోజూలానే ఆ రోజూ కూడా ఆమె చేతులకు శానిటైజర్ రాసుకుంది. ఇక ఆ తర్వాత కొవ్వొత్తి వెలిగించేందుకు అగ్గిపుల్ల గీసింది. ఆ వెంటనే ఆమె చేతికి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆమె భయపడి వెంటనే వెనక్కి దూకింది. వెనుక వైపు శానిటైజర్ బాటిల్ ఉంది. ఆమె ఆ బాటిల్ పై పడటంతో ఆమె చేతికి ఉన్న మంటలు శానిటైజర్ బాటిల్ కు అంటుకున్నాయి. దీంతో ఆ శానిటైజర్ బాటిల్ బాంబులా పేలింది.

మంటలు ఎగిసిపడటంతో ఆమె ముఖం, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇంట్లోనే ఉన్న కేట్ కూతుళ్లు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.   

 

Leave a Comment