ఒక్క ఇంచు వదలం : చైనా

లద్దాఖ్ లో భారత్-చైనా ఉద్రిక్తల నేపథ్యంో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్ గీ తో మాస్కోలో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో చైనా శనివారం ఒక ప్రకటన చేసింది. తమ భూభాగానికి చెందిన ఒక్క ఇంచును కూడా వదులుకోబోమని, లద్దాఖ్ లో ప్రస్తుత పరిస్థితికి బాధ్యత భారత్ దే అని ఆరోపించింది. తమ వద్ద సమర్థవంతమైన బలగాలు ఉన్నాయని, తమ భూభాగాన్ని, సౌర్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు తాము విశ్వాసంతో ఉన్నామని చైనా పేర్కొంది. 

చైనా ఇండియా సంబంధాలను మరింతగా పెంచడానికి మరియు శాంతయుత వాతావరణం నెలకోల్పడానికి ఇరు దేశాలు దృష్టి పెట్టాలని ప్రకటనలో చైనా తెలిపింది. భారత్, చైనా బోర్డర్ సమస్యకు బాధ్యత మొత్తం భారత్ పైనే ఉందని, ఒక్క ఇంచు కూడా వదులుకోబోమని స్పష్టం చేసింది. ఇటీవల పాన్ గాంగ్ సరస్సు వద్ద చైనా తన దళాలను మోహరించింది. దీంతో మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

Leave a Comment