పరీక్ష రాస్తుండగా మహిళ ప్రసవం.. బిడ్డకు ‘టెట్’ అని పేరు పెట్టారు..!

ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసేందుకు వచ్చిన మహిళ అభ్యర్థికి.. పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను వెంటనే అంబులెన్స్ లో సీహెచ్సీకి తరలించారు. అక్కడ ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు నాన్ పుర్ బిటా గ్రామానికి చెందిన రేణు దేవి టెట్ కి దరఖాస్తు చేసుకుంది. ఆమెకు అమ్రోహాలోని గజ్రౌలా ప్రాంతంలోని రమాబాయి డిగ్రీ కాలేజీ సెంటర్ లో ఆదివారం పరీక్ష రాసేందుకు వచ్చింది. పరీక్ష రాస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. 

దీంతో కేంద్రం నిర్వాహకులు వెంటనే అంబులెన్స్ ని పిలిపించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ రేణు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టెట్ పరీక్ష రాస్తుండగా జన్మించినందుకు వైద్య సిబ్బంది ఆ బిడ్డకు ‘టెట్’ అని పేరు పెట్టారు.     

 

Leave a Comment